ములగగౌరి నోము కథ
శ్లో|| ములగ పేరెత్తరాదు ములగను చూపించరాదు ములగనీడ నిలువరాదు
ములగను అంటరాదు ములగనోట బెట్టరాదు.
మాఘ పూర్ణిమ నాడైననూ , రధసప్తమి నాడైననూ పై మాటలు అనుకొని అక్షతలు వేసుకోవలెను.ఇది ఏడాది పాటు చేయవలెను. ములగనోమును నోచిన ముదితకు ముచ్చటలన్నియు తీరును.
ఉద్యాపన:
సంవత్సరము పూర్తయిన తరువాత ఉద్యాపన చేసుకొనవలెను. 12 మంది ముత్తైదువులను పిలిచి ఒక్కొక్క ముత్తైదువునకు పన్నెండేసి జతల ములగ కాడలను , లక్కజోడు , నల్లపూసల కోవ జతలను , దక్షిణ తాంబూలములతో వాయనము ఇవ్వవలెను. పద్ధతి తప్పిననూ ఫలము తప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి