నిత్యశృంగారపు నోము కథ
రాజుభార్య, మంత్రి భార్య నిత్యశృంగారపు నోము పట్టిరి. మంత్రి భార్య శ్రద్ధగా పేరంటాడ్రకు బొట్టుపెట్టి తాంబూలములనిచ్చి వ్రతము సాంతముచేసి ధనవంతురాలయియుండెను. రాజు భార్య ముత్తైదువులకు దాసీలచే బొట్టు పెట్టించుటచే దరిద్రవంతురాలయ్యెను. ఆమె తన దుర్దశకు దుఃఖించి పార్వతీదేవిని ప్రార్ధింపగా ఆమె ప్రత్యక్షమై నీవు అజాగ్రత్తగా దాసీలచే పేరంటాండ్రకు బొట్టుపెట్టించి దరిద్రాలువైతివి. యిప్పుడా నోమును జాగ్రత్తగా నోచుకొనుము అని చెప్పి అంతర్ధానమయ్యెను. అప్పటినుండి ఆ రాజుభార్య నోముపట్టి ప్రతిదినము ఒక పుణ్యస్త్రీకి బొట్టుపెట్టి అద్దము చూపించి తాంబూలమిచ్చి ఏడాదిగడవగనే ఉద్యాపనము చేసుకొనెను. అంతటామె భర్తకు పోయినరాజ్యము తిరిగి ప్రాప్తించెను.
ఉద్యాపన:
ఒక పుణ్యస్త్రీకి తలంటినీళ్ళుపోసి, చీర రవికెలగుడ్డనిచ్చి భోజనముబెట్టినతరువాత అద్దము, దువ్వెన, కాటుక కాయ, కుంకుమభరిణ, గంధపుచెక్క వాయన మియ్యవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి